పవన్ మాస్ చిత్రంపై అది రూమర్ మాత్రమే.?

Published on Jun 13, 2021 3:01 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో మళయాళ సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం ను యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలానే మార్పులు చేస్తున్న మేకర్ ఓ పక్క రానా రోల్ తో పాటుగా పవన్ రోల్ కి కూడా హీరోయిన్స్ సెట్ చేస్తున్నారని టాక్ బయటకి వచ్చింది. అయితే పవన్ కు సరసన మొదట సాయి పల్లవిని అనుకోగా లాస్ట్ కి నిత్యా మీనన్ ఫైనల్ అయ్యిందని తెలిసింది.

అటు సినీ వర్గాల నుంచి కూడా దాదాపు ఇదే కన్ఫర్మ్ అని తెలిసింది. కానీ లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ సమంతా పేరు ఇపుడు వినిపిస్తుంది అయితే ఇదంతా కేవలం రూమర్ మాత్రమే అని చెప్పాలి. నిత్యా ని రీప్లేస్ అయినా చేసుండాలి. మరి ఏది ఏమైనప్పటికీ మాత్రం దీనిపై అధికారిక క్లారిటీ వస్తే కానీ ఇవన్నీ ఆగవు..

సంబంధిత సమాచారం :