మరో విషాదం.. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కన్నుమూత.!

Published on Apr 20, 2022 8:49 am IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఇపుడు మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మరియు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ చైర్మన్ నారాయణ్ దాస్ నారంగ్ అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఇదే తీరని లోటు అనుకునే ఈ లోపు లోనే మరో విషాదం తెలుగు సినీ పరిశ్రమ వద్ద చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు గారు గత అర్ధ రాత్రి తన 84వ ఏట అనారోగ్యంతో చెన్నై ఓ ప్రయివేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కన్ను మూసారు.

మరి 1938 కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించిన తాను పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. వాటిలో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. యమగోల, జీవన తరంగాలు, ఆలు మగలు, దొరబాబు ఇలా ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించారు. మరి ఇపుడు ఈ లెజెండరీ దర్శకుని లేమితో తెలుగు సినిమా దగ్గర మరో తీరని లోటు విషాదం చోటు చేసుకున్నాయి. మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :