విషాదం..యాంకర్ ప్రదీప్ తండ్రి కన్నుమూత.!

Published on May 2, 2021 12:34 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు అందరికీ సుపరిచితమే.. తనదైన యాంకరింగ్, నటనతో అలరించే ప్రదీప్ ఇటీవలే హీరోగా కూడా మెప్పించి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కానీ అనుకోని విధంగా ప్రదీప్ నుంచి అనుకోని వార్త అందరూ వినాల్సి వచ్చింది. ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు గారు తన 65 వ నిన్న రాత్రి కన్నుమూసినట్టుగా వార్త బయటకు వచ్చింది.

అయితే దీనికి కారణం కోవిడ్ అనే తెలిసింది. దీనితో ప్రదీప్ ఇంట విషాదం నెలకొంది. ఇప్పటికే కరోనా మూలాన జరగాల్సిన దానికంటే ఎక్కువే నష్టం జరిగిపోయింది. ఇది మరో బాధాకరమైన వార్త అని చెప్పాలి. మరి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఇప్పుడున్న బాధాకర పరిస్థితులు తొలగిపోయి మునుపటి రోజులు రావాలని 123 టీం ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :