దర్శకుడు కేవీ ఆనంద్ మృతి విషయంలో మరో విషాద వార్త.!

Published on Apr 30, 2021 11:03 am IST

ఈరోజు ఉదయమే తమిళ విలక్షణ దర్శకుడు కేవీ ఆనంద్ మృతి చెందారని వచ్చిన వార్త ప్రతీ ఒక్కరినీ ఎంతగానో కలచి వేసింది. దీనితో దక్షిణాది సినిమాలో విషాద ఛాయలు అలముకున్నాయి. అయితే ఆయన గుండె పోటుతో మరణించారు అని ఆయన దేహాన్ని అఆసుపత్రి నుంచి తీసుకు రావడానికి తన హీరో సూర్య ప్రయత్నం చేసారని తెలిసింది.

కానీ ఇప్పుడు మరో ఊహించని విషాద వార్త బయటకి వచ్చింది. ఆయన మరణానికి గుండె పోటు కాకుండా కరోనా ప్రభావం కూడా మరో కారణం అని తెలిసింది. కొన్ని రోజులు కితమే వారి కుటుంబీకులకు కూడా కరోనా వచ్చిందని దానితో తర్వాత ఆయనకు కూడా పాజిటివ్ రావడంతో శ్వాస ఇబ్బందులు రావడం మూలాన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారట.

ఆ తర్వాత గుండె పోటు వచ్చి మరణించారని తెలిసింది. దీనితో ఇపుడు ఆయన దేహాన్ని బయటకు పంపడం కుదరని హాస్పిటల్ వారు తెలిపారు. కరోనా ప్రోటోకాల్స్ తో ఆయన దేహానికి అంత్యక్రియలు నగర్ ఎలక్ట్రికల్ అంత్యక్రియశాల కు పంపబడుతుంది అని వారు తెలియజేసారు. ఇది నిజంగా ఈ విషయంలో ఊహించని విషాదకర మలుపు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :