ఆడవాళ్లు మీకు జోహార్లు నుండి రేపు మరో సాంగ్ విడుదల!

Published on Mar 7, 2022 10:05 pm IST


శర్వానంద్ హీరోగా, రష్మీక మందన్న హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మార్చ్ 4 వ తేదీన థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం నుండి కలగా కలగా పాటను చిత్ర యూనిట్ రేపు విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :