బన్నీ కోసం మరో స్టార్ డైరెక్టర్ ?

బన్నీ కోసం మరో స్టార్ డైరెక్టర్ ?

Published on Jun 28, 2020 8:56 PM IST

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగాస్టార్ తో భారీ సినిమా ‘సైరా’ తీసి మంచి పేరు తెచ్చుకున్నా.. సురేందర్ రెడ్డికీ ఆ సినిమా భారీ ఆఫర్ ను తీసుకురాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్నారని, లేదూ ప్రభాస్ నటిస్తున్నారని వార్తలు అయితే వచ్చాయి గాని వాటిలో నిజం లేదని తేలిపోయింది. కాగా తాజాగా తన తరువాత సినిమాని అల్లు అర్జున్ తో చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది.

కాగా సురేందర్ రెడ్డి ఇప్పటికే బన్నీ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేస్తోన్నాడట. ఓ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా ఉండనుందని.. ముఖ్యంగా అల్లు అర్జున్ కు సరిపడే స్టోరీతో సురేందర్ రెడ్డి ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు