ప్రభాస్ సినిమాలో మరో స్టార్ హీరో ?

Published on May 3, 2021 3:20 pm IST

ప్రభాస్ తో సంజ‌య్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమా చేస్తోన్న దగ్గర నుండి ఈ సినిమాలో ఫలానా వాళ్ళు నటిస్తున్నారు అంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రూమర్ ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ‘ఆదిపురుష్’లో మరో సౌత్ స్టార్ హీరో నటించబోతున్నాడట. కన్నడ హీరో సుదీప్ ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట. అయితే సుదీప్ చేసేది విభీషణుడి రోల్ అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఆ మధ్య మాజీ హీరోయిన్ కాజోల్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతుందని ఓ వార్త బాగా వైరల్ అయింది. అది ఫేక్ న్యూస్ అని ఆ తరువాత క్లారిటీ వచ్చింది. మరి ఈ సారి వచ్చిన న్యూస్ లో నిజం ఎంత ఉందో చూడాలి. కాగా దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :