మెగా మేనల్లుడి సినిమాలో మరో స్టార్ !

మెగా మేనల్లుడి సినిమాలో మరో స్టార్ !

Published on Feb 13, 2019 2:26 AM IST

vaishnav

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడైన వైష్ణ‌వ్‌ తేజ్ నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం బెస్తవాళ్ల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇందులో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఆ రోల్ లో విజయ్ సేతుపతి నటిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు