“పుష్ప” రెండు పార్ట్స్ అంశంపై మరో స్ట్రాంగ్ బజ్.!

Published on May 7, 2021 8:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదనే కాకుండా బన్నీ మరియు సుకుమార్ ల కాంబో నుంచి వస్తున్న హ్యాట్రిక్ సినిమా కూడా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ ముందు నార్మల్ గానే అనుకున్న ఈ చిత్రం తర్వాత మాసివ్ పాన్ ఇండియన్ చిత్రం అయ్యింది. అంతే కాకుండా ఇప్పుడు అది కూడా రెండు పార్ట్స్ గా విడుదల అవుతుంది అని టాక్ వైరల్ అవుతుంది. అయితే మరి ఇది దాదాపు నిజం అవ్వొచ్చని మరో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దాదాపు ఈ చిత్రం రెండు సినిమాల్లా వచ్చేలానే ఉందని.

అలా వస్తే ఒకటి ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కాగా మరొకటి వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందని టాక్. అంతే కాకుండా బన్నీ డి డ్యూయల్ రోల్ కూడా కావచ్చని మళ్ళీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏది ఎంత వరకు నిజమవుతుందో అధికారిక క్లారిటీ వచ్చే వరకు తెలియదు. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :