‘ఎన్టీఆర్’ సినిమాకే ఎందుకిలా జరుగుతోంది..?
Published on Jun 2, 2018 5:43 pm IST


నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావుగారి జీవితాన్ని బయోపిక్ రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ చిత్రానికి స్క్రిప్ట్ దశ నుండి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సినిమాని మొదలుపెట్టిన తేజ దర్శకుడు బాలయ్యను ఒప్పించలేకో మెప్పించలేకో ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా ఆ తర్వాత కొన్నాళ్ళకు క్రిష్ ను దర్శకుడిగా ప్రకటించారు బాలయ్య.

దాంతో అభిమానుల్లో సినిమా మీద అంచనాలు పెరిగాయి. కానీ ఇప్పుడు క్రిష్ వ్యక్తిగత జీవితంలో ఒడిడుకులు వస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆయన తన భార్యతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సమస్య క్రిష్ మీద పని మీద ప్రభావం చూపిస్తే సినిమా పరిస్థితి ఏంటి, అసలు అన్నగారి సినిమాకే ఇన్ని సమస్యలేందుకు తలెత్తుతున్నాయి అనే ఆందోళన అభిమానుల్లో మొదలై అందరూ ఏది ఏమైనా సినిమా ఈ అడ్డంకులన్నిటినీ దాటుకుని సజావుగా పూర్తికావాలని కోరుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook