‘ఘాజీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు తెలుగు పరిశ్రమను కూడా ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. కాగా ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని హీరో పెట్టి సంకల్ప్ దర్శకత్వం వహించిన ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించలేదు. అయినప్పటికీ మొట్టమొదటి తెలుగు స్పేస్ థ్రిల్లర్ మూవీ అని మంచి పేరు వచ్చింది.
కాగా తాజాగా సంకల్ప్ రెడ్డి మరో టెక్నికల్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. తన మూడవ సినిమాని అంటార్కిటికాలో జరిగే పరిశోధనల నేపథ్యంలో తీయాలని సంకల్ప్ రెడ్డి నిర్ణయించుకున్నారట. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారో అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.


