మహర్షి నుండి మరో అప్డేట్ రానుంది !

Published on Apr 5, 2019 8:28 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వచిత్రం ‘మహర్షి’ అప్డేట్స్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఈచిత్రం యొక్క టీజర్ గురించి అప్డేట్ ఇవ్వగా తాజాగా ఈ చిత్రం నుండి మరొక అప్డేట్ వెలుబడనుందని సమాచారం. ఈరోజు 9:09 కి ఈ అప్డేట్ ను రివీల్ చేయనున్నారు.

వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న గ్రాండ్ గా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :