బాలయ్య క్రేజీ కాంబో పై మరో అప్డేట్ కూడా.!

Published on Jun 8, 2021 1:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ చిత్రం లైన్ లో ఉండగానే బాలయ్య మరో రెండు చిత్రాలు ఒప్పుకున్నా సంగతి తెలిసిందే. అయితే వీటిలో మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి.

మరి ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానున్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఇవ్వనున్నారని టాక్ ఉంది. అయితే ఈ అప్డేట్ తో పాటుగా మరో బజ్ ఈ కాంబోపై వినిపిస్తుంది. ఈ చిత్రం తాలూకా ముహూర్తం కూడా అదే రోజున జరగొచ్చని తెలుస్తుంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం అప్పుడే ముహూర్తం జరుపుకుంటుందో లేదో చూడాలి. అలాగే దీనితో పాటుగా మరో హిట్ దర్శకుడు అనీల్ రావిపూడితో ప్రాజెక్ట్ పై అనౌన్సమెంట్ కూడా ఆరోజే ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :