మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలు ఒప్పుకుంటున్న నేపథ్యంలో చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కొత్త కథలు రాయడం మొదలెట్టారట. ఇప్పటికే చిరుకు కొంతమంది లైన్స్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు కోసం ఒక ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే కథను రాశాడని తెలుస్తోంది.
కాగా ఎలాగూ మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, తన కథను ఓకే చేస్తాడనే వెంకీ ఆశ పడుతున్నాడట. త్వరలోనే మెగాస్టార్ కి వెంకీ కుడుముల కథ చెప్పనున్నాడట. మరి చూడాలి వెంకీ కథ.. మెగాస్టార్ కి నచ్చుతుందో లేదో. ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్యతో పాటు మెహర్ రమేష్ సినిమాని చేస్తున్నారు. అలాగే మలయాళంలో ‘లూసిఫర్’ అనే సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వచ్చిన సంగతి తెలిసిందే.


