ఎన్టీఆర్ బయోపిక్ నుండి ‘ఏఎన్ఆర్’ ఫస్ట్ లుక్ విడుదల ఎప్పుడంటే !

ఎన్టీఆర్ బయోపిక్ నుండి ‘ఏఎన్ఆర్’ ఫస్ట్ లుక్ విడుదల ఎప్పుడంటే !

Published on Sep 20, 2018 3:32 AM IST

లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రంలో నుండి ఏఎన్ఆర్ ఫస్ట్ లుక్ ను ఉదయం 09:33 గంటలకు విడుదలచేయనున్నారని సమాచారం. విశ్వవిఖ్యాత నందమూరి తారకరామ రావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా ఏఎన్ఆర్ పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు. ప్రస్తుతం సుమంత్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

క్రిష్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. విష్ణు ఇందూరి , సాయి కొర్రపాటి లతో కలిసి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు