మళ్లీ నటనలో పాల్గుంటున్న ఏ.ఎన్.ఆర్

Published on Nov 17, 2013 1:00 am IST

ANR-Press-Meet
కడుపు క్యాన్సర్ కారణంగా ఆసుపత్రి పాలైన నాగేశ్వరరావు గారు కాస్త విరామం తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. సమాచారం ప్రకారం ఆయన చాలా బాగా కోలుకున్నారని, ఆయన నటిస్తున్న మనం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో పాల్గుంటున్నారని తెలిసింది. విక్రమ్ కుమార్ తీస్తున్న ఈ సినిమాలో అక్కినేని వంశంలో మూడు తరాల నటులూ నటించడం విశేషం

సెప్టెంబర్ లో ఈ సినిమా మొదటి లుక్ విడుదలై అందరి ప్రశంసలు అందుకుంది. ద్వారా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా అనుకున్నట్టేతెరకేక్కుతుందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం :