అంతరిక్షం షూటింగ్ ముగిసింది !

Published on Oct 1, 2018 4:42 pm IST

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’షూటింగ్ నేటితో పూర్తయింది. స్పెస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. తన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్న ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈచిత్రంలో వరుణ్ వ్యోమగామి పాత్రలో నటిస్తుండగా అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నాడు. తెలుగులో స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే మొదటి చిత్రం ఇదే కావటంతో ఈ చిత్రం ఫై మంచి అంచనాలు వున్నాయి. ఈచిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :