ఇంటర్వ్యూ : అను ఇమ్మాన్యుయేల్ – శైలజారెడ్డి అల్లుడు నాకు బ్రేక్ ఇస్తుంది !

Published on Sep 6, 2018 3:22 pm IST

మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య , అను ఇమ్మాన్యుయేల్ జంటగా సితార ఎంటెర్టైనెంట్స్ నిర్మించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో మాట్లాడింది ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం ..

సినిమా లో మీ పాత్ర గురించి ?

ఈసినిమాలో ఇగోయిస్టు పాత్రలో నటించాను. కానీ అందులో కామెడీ కూడా ఉంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారా ఎక్కువగా మాట్లాడే అవకాశం వచ్చింది.

రమ్యకృష్ణ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

ఈ సినిమాలో ఆమె కూతురి గా నటించాను . రమ్య మేడమ్ చాలా బ్రిలీయంట్ ఒక్కసారి స్క్రిప్ట్ చూసుకొని ఎంత పెద్ద డైలాగ్ నైనా అలోవకగా చెప్పేస్తుంది.

మీరు నటించిన సినిమాలు వరుసగా పరాజయాలు పొందాయి. మీరు కథ వినకుండానేసి సినిమాలు ఒప్పుకున్నారా ?

లేదు అజ్ఞాతవాసి చిత్ర కథ ను తివిక్రమ్ గారు చెప్పారు . నా పాత్ర గురించి వివరించిన తరువాతే ఆసినిమా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత పాత్ర ఏమి ఉండదు. ఇది కూడా అలాగే ఉంటే నేను చేయకపోయేదాన్ని. ఆసినిమాలోచేయడానికి మరొక కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో నటించే అవకాశం వచ్చింది. నాపేరు సూర్య కూడా కథ విన్నాకే ఒప్పుకున్నాను.

గీత గోవిందం లో నటించే అవకాశం మొదట మీకే వచ్చిందట ఎందుకు వదులుకున్నారు ?

ఆ సమయంలో అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చేస్తున్నాను. అందుకే చేయడం కుదరలేదు.

ఇప్పుడు ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది అలాంటి సినిమాను వదులుకుంనందుకు ఏమైనా ఫీల్ అవుతున్నారా ?

నేను ఇంకా గీత గోవిందం సినిమా చూడలేదు. కానీ సినిమా సూపర్ హిట్ అయినందుకు సంతోషంగా వుంది అలాగే కొంచెం ఫీల్ అవుతున్న మంచి సినిమాను మిస్ చేసుకుందుకు.

మీ తదుపరి చిత్రాలు ?

ఇంకా వేరే సినిమాలకు సైన్ చేయలేదు. శైలజారెడ్డి అల్లుడు విడుదలైన తరువాత డిసైడ్ అవుతాను.

తమిళ , మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారా ?

ప్రస్తుతానికి లేదు . మంచి పాత్ర దొరికితే తమిళ్ లో సినిమా చేయాలనీ వుంది. ఇక మలయాళం స్క్రీన్ షేర్ తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు నివిన్ పౌలీ తో ఒక సినిమాలో నటించాను. ఆసినిమాలో కూడా స్క్రీన్ షేర్ తక్కువగానే వుంటుంది. అందుకే మంచి పాత్రలకోసం ఎదురుచూస్తున్నాను.

సంబంధిత సమాచారం :