స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని చిత్ర యూనిట్ చూస్తోంది. ఇక ఈ క్రమంలో వెంకటేష్‌తో తన నెక్స్ట్ చిత్రాన్ని చేసేందుకు మరో డైరెక్టర్ కూడా రెడీ అవుతున్నాడట.
‘జాతిరత్నాలు’ చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కేవీ అనుదీప్ తాజాగా ‘ఫంకీ’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కయాదు లోహర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాను పూర్తి ఫన్ రైడ్‌గా అనుదీప్ తీర్చిదిద్దాడు. కాగా, ఈ సినిమా తర్వాత వెంకటేష్‌తో ఓ సినిమా చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వెంకీకి స్క్రిప్ట్ వినిపించిన అనుదీప్, ఆయన సూచన మేరకు కొన్ని మార్పులు చేస్తున్నాడట.
ఒక్కసారి ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవ్వగానే వెంకటేష్‌కు వినిపించి ఓకే చేయించుకునే ప్రయత్నం చేస్తాడట. ఇక ఈ కాంబినేషన్లో సినిమా అనగానే పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ కాంబోలో సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.
