నాగ్-ధనుష్ సినిమాలో నటించనున్న అను !

నాగ్-ధనుష్ సినిమాలో నటించనున్న అను !

Published on Sep 14, 2018 5:47 PM IST

Anu Emmanuel

తమిళ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అగ్ర హీరో కింగ్ నాగార్జున నటించనున్నారని తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఇప్పుడు యువ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ను ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారట. ఆమె నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు ‘నిన్న విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈచిత్రంలో ఇగోయిస్టు పర్సన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది అను. ఇప్పుడు తాజగా ధనుష్ తెరకెక్కిస్తున్న చిత్రానికి సైన్ చేసింది.

త్వరలోనే ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనున్నారు నాగ్, అను. ఇక వీరితోపాటు ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి, శరత్ కుమార్, ఎస్ జె సూర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘పవర్ పాండి’ ఫెమ్ సీన్ రోనాల్డ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు