హలో గురు కోసం డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ !

anupama1
రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘నేను లోకల్’ ఫెమ్ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది.

ఇక ఈ చిత్రంలోని తన పాత్రకు స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది అనుపమ. అతి త్వరలోనే ఈ చిత్రం యొక్క విడుదల తేదీని ప్రకటించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈచిత్రాన్ని అక్టోబర్ 18న విడుదలచేయనున్నారు.

Exit mobile version