‘హలో గురు ప్రేమ కోసమే’ డబ్బింగ్ చెబుతున్న అనుపమా !

Published on Oct 3, 2018 2:01 am IST


నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరో గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ రోజు ఈ చిత్ర హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది. ఈ సినిమాలో ఆమె ఓ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ గా కనిపించనుంది.

ఇటీవలే జరిగిన షెడ్యూల్ లో కాలేజీ సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరిచింది. అనుపమా కోసం రామ్ కాలేజీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ.. ఆమెను ప్రేమలో దించే సన్నివేశాలు అట అవి. పైగా రామ్ – అనుపమా ఈ చిత్రంలో బావ మరదళ్లగా నటిస్తోన్నారు. అనుపమా తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కి రామ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు.

‘సినిమా చూపిస్తా మావ’ ‘నేను లోకల్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన టీమే, ఈ చిత్రానికి కూడా కలిసి పని చేస్తుండటంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :