ఆ ఆటకు బానిసైన అనుపమ పరమేశ్వరన్..!

Published on Jul 16, 2021 1:20 am IST


టాలీవుడ్ హీరోయిన్, కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘అఆ’ ప్రేమమ్, శతమానం భవతి వంటి పలు సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది.

అయితే సోషల్ మీడియా ద్వారా నిత్యం ఏదో ఒక ఫోటోను, ఫన్నీ వీడియోలను షేర్ చేసే ఈ అమ్మడు తాజాగా ఓ ఆటకు బానిసయ్యిందట. గిబ్బరిష్ అనే ఆటలో కొన్ని వెరైటీ పదాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. వాటిని మనం పలికే దాన్ని బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టేయవచ్చు. ఈ ఆటను తెగ ఆడేస్తున్న అనుపమ, ఈ ఆటకు బాగా బానిసనయ్యాను అని ఇక ఇందులో నుంచి తేలడం కష్టమేనంటూ ఇన్‌స్టా ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుపమ నిఖిల్ సరసన 18పేజెస్, రౌడీ బాయ్స్ అనే సినిమాల్లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :