పవన్ కళ్యాణ్ గారు ఎంతో గౌరవంతో ప్రేమతో – అనుపమ

Published on May 1, 2021 10:26 pm IST

‘వకీల్ సాబ్’ సినిమా అనగానే ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ మాత్రమే హైలైట్ అవుతాడు అనుకుంటే.. నివేదా థామస్ కూడా తన నటనతో అలాగే ఆమె పాత్రతో హైలైట్ నిలిచింది. నిజానికి ఈ పాత్ర మొదట అనుపమ పరమేశ్వరన్ దగ్గరకు వెళ్ళింది. డేట్స్ కుదరక అనుపమ ఈ సినిమాని వదులుకుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన తరువాత అనుపమ తెగ ఫీల్ అయిపోతూ ఒక ట్వీట్ చేసింది.

అనుపమ మెసేజ్ చేస్తూ ‘సో సారీ గయ్స్… ఇప్పడే నేను రియలైజ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మీ పై ఎంతో గౌరవం మరియు ప్రేమతో’ అంటూ అనుపమ కాస్త ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసింది. ఇక ప్రీమియర్ షోల నుండే ‘వకీల్ సాబ్’ కలెక్షన్స్ సునామీతో స్టార్ట్ అయ్యాడు. మొత్తం మీద ఈ ఏడాది ఇంత భారీ మొత్తం పొందిన ఏకైక ఇండియన్ మూవీగా ‘వకీల్ సాబ్’ నిలవడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానాలు గర్వంగా సగర్వంగా చాటి చెప్పుకునే అంశమే. పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ వల్ల ఈ కోవిడ్ పరిస్థితులలో కూడా నిర్మాతలకు బయ్యర్లకు కాసుల పంట పడింది.

సంబంధిత సమాచారం :