నిఖిల్ ’18 పేజెస్’లో అనుపమ ?

Published on Aug 9, 2020 3:00 am IST

కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ వస్తున్న నిఖిల్.. తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు అనుపమ పరమేశ్వరన్ నే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేయనున్నారు.

మరి అనుపమ పరమేశ్వరన్ కెరీర్‌కు ఈ సినిమాతో బ్రేక్ లభిస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందని తెలుస్తోంది. నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతుంది.

సంబంధిత సమాచారం :

More