కార్తికేయ 2 లో హీరోయిన్ గా అనుపమ!

Published on Aug 30, 2021 9:00 pm IST

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కార్తికేయ 2. ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర ఎవరు చేస్తారు అనే దాని పై చిత్ర యూనిట్ తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ సిద్ధార్థ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రం తెలుగు లో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇప్పటికే నిఖిల్ సిద్ధార్థ్ తో అనుపమ పరమేశ్వరన్ 18 పేజెస్ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :