RRR ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశం ఉంది – అనురాగ్ కశ్యప్

RRR ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశం ఉంది – అనురాగ్ కశ్యప్

Published on Aug 16, 2022 1:03 PM IST

బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ RRR చిత్రం పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆస్కార్ నామినేషన్లలో ఈ చిత్రం వచ్చే అవకాశంపై బోల్డ్ అంచనా వేశారు. ఒక మీడియా అవుట్‌లెట్‌తో తన తాజా ఇంటరాక్షన్‌లో ఇలా అన్నాడు.

ఇండియా నుండి ఏదైనా చిత్రాన్ని పంపితే RRR వాస్తవానికి ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశం 99 శాతం ఉంది అని అన్నారు. RRR హాలీవుడ్ వరల్డ్ లో శాశ్వత ముద్రను కలిగి ఉంది. నా అభిప్రాయం ప్రకారం, ఇది ఖచ్చితంగా ఆస్కార్‌కు నామినేట్ అవుతుంది. ఈ సినిమా చూసి పాశ్చాత్య దేశస్తులు సినిమాను కొనియాడారు. ఇది అపూర్వమైన విషయం అంటూ చెప్పుకొచ్చారు. RRR నిజానికి ఆస్కార్స్ 2023 కి నామినేట్ అవుతుందా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. అవుననే సమాధానమైతే వస్తుంది. అదే జరిగితే సౌతిండియన్ సినిమాకి అది పెద్ద ముందడుగు అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు