మళ్ళీ షూటింగ్‌తో బిజీ అయిన అనుష్క!

మళ్ళీ షూటింగ్‌తో బిజీ అయిన అనుష్క!

Published on Dec 5, 2015 12:12 PM IST

anushka

‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’.. ఇలా గత కొద్దిరోజులుగా ప్రత్యేక తరహా సినిమాలతోనే మెప్పిస్తూ వస్తోన్న అనుష్క, తాజాగా మళ్ళీ ఓ హీరో ప్రధాన సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైపోయారు. సూర్య, అనుష్క జంటగా తమిళంలో సింగం సిరీస్‌లో గతంలో రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌లో ‘సింగం 3’ పేరుతో కొత్త సినిమా రానుంది. ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్‌లో అనుష్క కూడా జాయిన్ అయిపోయారు.

ప్రతిష్టాత్మక బాహుబలి సినిమాకు కొనసాగింపైన బాహుబలి ది కంక్లూజన్ కోసం అనుష్క భారీ ఎత్తున డేట్స్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాహుబలి కంటే ముందే ‘సింగం 3’ని పూర్తి చేసేలా అనుష్క ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ చివరి వారంలో ప్రారంభం కానున్న బాహుబలి పార్ట్ 2లో అనుష్కకు సంబంధించిన సన్నివేశాలు జనవరి నెలలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే విడుదలైన ‘సైజ్ జీరో’తో నటిగా మరో ఎత్తుకు చేరిన అనుష్క ప్రస్తుతం ఈ రెండు సినిమాలు మాత్రమే కాక నాగార్జున, కార్తిల ఊపిరి సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయనున్నారు.

తాజా వార్తలు