అనుష్క, గోపిచంద్ జంటగా యాక్షన్ ఎంటర్టైనర్ ?
Published on May 17, 2018 11:18 am IST

యాక్షన్ హీరో గోపిచంద్, స్టార్ హీరోయిన్ అనుష్క ఇద్దరూ మరోసారి జంటగా నటించనున్నట్లు ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది కూడ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం విశేషం. ఈ చిత్రాన్ని దర్శకుడు జయేంద్ర డైరెక్ట్ చేస్తారట.

ఈయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘నా నువ్వే’ ఈ నెల 25న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటిలు గోపిచంద్ చిత్రాన్ని కూడ నిర్మిస్తారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. గతంలో గోపిచంద్, అనుష్కలు ‘లక్ష్యం, శౌర్యం’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook