మెగాస్టార్ ‘లూసిఫర్’లో అనుష్క ?

Published on May 16, 2021 2:00 am IST

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పైగా హీరోయిన్ గా నయనతారను ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, హీరోయిన్ పాత్ర నిడివి తక్కువ అని, జస్ట్ గెస్ట్ రోల్ లాంటిది అని, అందుకే ఆ పాత్రలో అనుష్క అయితే బాగుంటుందనే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడట.

ఇక హీరోయిన్ ను సాంగ్ కు మాత్రమే పరిమితం చేస్తారా లేక సీన్స్ లో కూడా ఇన్ వాల్వ్ చేస్తారా అనేది చూడాలి. ఇక మోహన్ రాజాకి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడనగానే ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇలాంటి స్క్రిప్ట్ లను మోహన్ రాజా బాగా హ్యాండిల్ చేస్తారు. పైగా మోహన్ రాజా ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రచయిత లక్ష్మి భూపాల్ తో డైలాగ్స్ రాయిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :