కమల్ సూపర్ హిట్ సీక్వెల్ లో అనుష్క ?

కమల్ సూపర్ హిట్ సీక్వెల్ లో అనుష్క ?

Published on Mar 29, 2020 5:00 PM IST

కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రాల్లో ‘రాఘవన్’ కూడా ఒకటి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుందనే వార్తలు మొదట్లో రూమర్లే అనుకున్నా ఇప్పుడు మాత్రం నిజమేనని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఈ సినిమాలో కథానాయకిగా అనుష్క పేరు పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.

కాగా తాజాగా సినీ వర్గాలు సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనుష్కను ఫైనల్ చేశారట. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే గతంలో అనుష్క గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘యెన్నై ఆరిందాల్’ చిత్రంలో నటించగా వీరి కాంబోలో ఒక లేడీ ఒరియెంటెడ్ చిత్రంలో నటించాల్సి ఉండగా అది వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు ‘రాఘవన్ -2’ లో నటిస్తుంది. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు