అనుష్క సైలెన్స్.. లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 21, 2019 2:00 am IST

అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించబోతుందట. అలాగే మాధవన్ సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది.

ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ‘అరుంధతి, భాగమతి’ తరహా చిత్రాలు లాగానే ఈ సినిమాలో కూడా అనుష్క పెర్ఫామెన్స్ నే హైలెట్ కానుందని చెబుతుంది చిత్రబృందం. ఇక ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్న అనుష్క.. ఆ తరువాత చాలా రోజులు విరామం తీసుకుని ఈ సినిమాని చేస్తోంది. మరి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More