నాగార్జునకు కృతజ్ఞతలు తెలుపుకున్న అనుష్క !

Published on Mar 14, 2019 2:00 am IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఆ తరువాత కొన్ని హిట్ సినిమాల్లో నటించినా.. అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ అనుపించుకుంది. ఇక ఆ సినిమా తరువాత అనుష్క కెరీర్ లో వెనుక్కి తిరిగి చూసుకోలేదు. అయితే అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14 ఏళ్ళు గడిచిపోయాయి.

ఈ సందర్బంగా తాను సినీ పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి కారణమైన ప్రతిఒక్కరికీ సోషల్ మీడియా ద్వారా అనుష్క కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా తనకు ఫస్ట్ సినిమలో ఛాన్స్ ఇచ్చిన నాగార్జునకు, పూరి జగన్నాథ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

కాగా ‘భాగమతి’ తరువాత చాలా రోజులు విరామం తీసుకుని అనుష్క ‘సైలెన్స్’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, సుబ్బరాజ్ ముఖ్య పాత్రల్లో థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది ఈ చిత్రం.

సంబంధిత సమాచారం :