పెళ్ళికి రెండు కండిషన్స్ పెట్టిన అనుష్క

పెళ్ళికి రెండు కండిషన్స్ పెట్టిన అనుష్క

Published on Aug 31, 2014 11:36 AM IST

anushka
అరేబియన్ రేసుగుర్రం లాంటి అనుష్క వయసు మూడు పదులు దాటింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్న గత కొన్ని రోజుల నుండి అనుష్కకు ఎదరవుతుంది. తనకు ఎలాంటి వరుడు కావాలో అనుష్క చెప్పింది. ‘వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటా. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేక అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగితే చెప్పడం కష్టం. కాకపోతే నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి రెండు షరతులకు అంగీకరించాలి.’ అని చెప్పింది.

‘పెళ్లి తర్వాత కూడా నేను సినిమాలలో నటించడానికి అంగీకరించే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా. ఇంకో విషయం అబ్బాయి నాకంటే ఎత్తుగా ఉండాలి. ఈ రెండు కండిషన్లకు పెళ్లి కొడుకు తప్పకుండా ఒప్పుకోవాలి అని సెలవిచ్చింది. ఆరడుగుల ఎత్తున్న అనుష్కకు సరైన పెళ్లి కొడుకును వెతకడం ఆమె తల్లిదండ్రులకు కొంచం కష్టం అవుతుంది. ప్రస్తుతం వారు అదే పనిలో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం అనుష్క చారిత్రాత్మక చిత్రాలైన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, అలాగే రజినీకాంత్ ‘లింగా’, అజిత్ కొత్త సినిమాలలో నటిస్తుంది. ఇవి పూర్తయ్యాకా పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది.

తాజా వార్తలు