చివరి దశలో అనుష్క ‘జీరో సైజ్’

చివరి దశలో అనుష్క ‘జీరో సైజ్’

Published on Jun 28, 2015 11:58 AM IST

anushka
సౌత్ ఇండియాలో అందరి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ఎబలేని గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ యోగా బ్యూటీ అనుష్క. అలాంటి అనుష్క చేస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘జీరో సైజ్’. రెండు నెలల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుందని ఇదివరకే తెలియజేశాం. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ ఇచ్నేమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. టాకీ పార్ట్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో కొన్ని పాటల షూటింగ్ మాత్రం బాలన్స్ ఉంది.

అనుష్క కూడా ఈ సినిమా కోసం కంటిన్యూ డేట్స్ ఇవ్వడమే కాకుండా గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తోంది. ఈ సినిమాలో అనుష్క రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుంది. అందులో ఓ పాత్ర కోసం 20 కేజీల బరువు కూడా పెరిగింది. పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే గ్లామరస్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కూడా స్టెప్పులేయనుంది.

స్వచ్చమైన ప్రేమకి ఫిజికల్ బ్యూటీతో అవసరం లేదు అనే కాన్సెప్ట్ తో రానున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్లో ఆర్య, భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ – స్క్రీన్ ప్లే అందించింది.

తాజా వార్తలు