
సౌత్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ గ్రాఫికల్ వండర్స్ అయిన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలలో లీడ్ రోల్ చేస్తున్న హీరోయిన్ అనుష్క. గత రెందేల్లగా ఎంతో కష్టపడిన అనుష్క ఈ రెండు సినిమాల షూటింగ్ ని ఫినిష్ చేసింది. ఈ రెండు సినిమాల షూటింగ్ ఫినిష్ చేయగానే మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘జీరో సైజ్’ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అనుష్క ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తోంది. ఈ సినిమాలో అనుష్క రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుంది. అందులో ఓ పాత్ర కోసం 20 కేజీల బరువు కూడా పెరిగింది. పివిపి సినిమాస్ బ్యానర్ లో పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ ఓ అతిధి పాత్రలో కనిపించడమే కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కూడా స్టెప్పులేయనుంది.
ఆర్య, భరత్, ఊర్వసి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించనున్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ – స్క్రీన్ ప్లే అందించింది.

