అనుష్క నిశ్శబ్దం పై సందిగ్ధం తీరేది ఎప్పుడంటే..!

Published on Jan 10, 2020 7:13 am IST

స్వీటీ అనుష్క ఈమధ్య ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం భాగమతి అనే హారర్ థ్రిల్లర్ చేసిన అనుష్క తాజాగా నిశ్శబ్దం చిత్రం చేస్తున్నారు. హారర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క మూగదైన పెయింటింగ్ కళాకారిణి నటిస్తున్నారు. ఇక హీరో మాధవన్ మ్యూజీషియన్ గా నటించడం విశేషం. కొద్దిరోజుల క్రితం నిశ్శబ్దం టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ అందుకుంది. నిశ్శబ్దం మూవీ జనవరి 31న విడుదల అవుతుంది. ఐతే ఈ చిత్ర విడుదల వాయిదా పడ్డట్టు తెలుస్తుంది.

మూవీ విడుదలకు దగ్గర పడుతున్నా నిర్మాతలు చిత్ర ప్రమోషన్స్ పై ద్రుష్టి సారించలేదు. చిత్ర విడుదల మరియు ప్రమోషన్స్ వంటి విషయాలపై నిశ్శబ్దం చిత్ర నిర్మాత కొనా వెంకట్ స్పందించారు.చిత్ర ప్రమోషన్స్ కొరకు మా దగ్గర మంచి ప్రణాళిక ఉందన్న ఆయన…నిశ్శబ్దం చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సంక్రాంతి పండుగ తరువాతే అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఐతే మూవీ విడుదల ప్రకటించిన విధంగా జనవరి 31న ఉంటుందా లేదా అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో షాలిని పాండే, అంజలి కీలక రోల్స్ చేస్తున్నారు. అమెరికాలోని సియాటిల్ నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది.

సంబంధిత సమాచారం :