విడుదల తేదీ : ఫిబ్రవరి 20, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల తదితరులు
దర్శకుడు : ప్రమోద్ హర్ష
నిర్మాతలు : రాధా వి పాపుడిప్పు మరియు వెంకట్ ఆర్ పాపుడిప్పు
సంగీత దర్శకుడు : ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రాఫర్ : క్రాంతి వర్ల
ఎడిటర్ : పవన్ నరవ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో శివ కందుకూరి నటించిన ఎమోషనల్ చిత్రం నవాబ్ కేఫ్ (Nawab Cafe) కూడా ఒకటి. మొదట చాయ్ వాలా గా రావాల్సిన ఈ సినిమా నవాబ్ కేఫ్ గా మారి ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
Nawab Cafe కథ:
హైదరాబాద్ పాతబస్తీలో తన తాత ముత్తాతల తరాల నుంచి నడిపిస్తున్న నవాబ్ కేఫ్ (Nawab Cafe) ని రంగనాథ్ (రాజీవ్ కనకాల) సక్సెస్ ఫుల్ గా తన టైం లో కూడా నడిపిస్తారు. అయితే తన కొడుకు రాజా (శివ కందుకూరి) మాత్రం ఈ నవాబ్ కేఫ్ భాద్యతలు చేపట్టడానికి మాత్రం ఇష్టపడడు. తనకి వేరే కలలు ఉంటాయి. కానీ ఊహించని విధంగా పరిస్థితులు మారడంతో ఆ భాద్యతలు రాజా వద్దకే వస్తాయి. ఇక అక్కడ నుంచి కథ ఎలా మారింది? తనకి ఇష్టం లేని భాద్యతలు తన మీదకి వచ్చాక రాజా వాటిని ఎలా డీల్ చేసాడు. తనకున్న డ్రీం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఇటీవల కపుల్ ఫ్రెండ్లి లోనే సాలిడ్ రోల్ లో కనిపించిన రాజీవ్ కనకాలకి మరో మంచి తండ్రి పాత్ర ఈ సినిమాలో పడింది అని చెప్పొచ్చు. తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చే కొడుకుగా ఇంకోపక్క తన భావజాలానికి భిన్నంగా ఉండే కొడుకుకి తండ్రిగా తాను ఈ సినిమాలో చాలా బాగా చేశారు.
ఇక యువ నటుడు శివ కందుకూరి కూడా ఈ సినిమాలో మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. రెండు షేడ్స్ తన రోల్ లో ఉన్నాయి. మరి ఆ రెండిటిని కూడా తాను బాగా చేశారు. ఒక యంగ్ స్టర్ గా మొదటి సగం ఒక సరదా కుర్రాడి పాత్రలో మెప్పిస్తే నెక్స్ట్ సగంలో ఓ బాధ్యతగల కుర్రాడిగా తన పెర్ఫామెన్స్ లో చూపించాడు. అలాగే ఇంటర్వెల్ కి ముందు కొన్ని నిమిషాల కథనం బాగుంది. అలానే రాజీవ్ కి తన కొడుకుకి నడుమ జరిగే ఓ ఘర్షణ సన్నివేశం అందులోని సందేశం కూడా వర్క్ అయ్యింది.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ప్రధాన సమస్య ఏదైనా అంది అంటే అది కథనమే అని చెప్పాలి. స్క్రీన్ ప్లే బాగా అవుట్ డేటెడ్ గా అనిపిస్తుంది. చూపించే సన్నివేశాలు కొనసాగే మూడ్ ఆల్రెడీ చూసేసినట్టే చాలా రొటీన్ ఫీల్స్ నే కలిగిస్తాయి. అలాగే దర్శకుడు సినిమాలో మెయిన్ అంశంకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది.
ఇక ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ కూడా అంతగా పేలలేదు. నవ్వు తెప్పించని కామెడీ, లీడ్ జంట నడుమ రొమాంటిక్ ఎపిసోడ్స్ లాంటివి ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. అలాగే ఈ సినిమా ఇటీవల ధనుష్ నుంచి వచ్చిన ‘ఇడ్లీ కొట్టు’ నేపథ్యం లానే అనిపిస్తుంది. అందులో కూడా ధనుష్ రోల్ కి తన తండ్రి ఎప్పుడు నుంచో నడిపిస్తున్న ఇడ్లి కొట్టు నడిపించే బదులు ఇతర ఆశలు ఉంటాయి కానీ మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇక్కడ కూడా ఇదే తరహాలో కనిపిస్తుంది.
అదే ఓల్డ్ టెంప్లేట్ అనుకుంటే మళ్ళీ అదే కాన్సెప్ట్ లో ఇదీ రావడం మరింత రొటీన్ గా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా సెకండాఫ్ లో దర్శకుడు ఎమోషన్స్ పై మరింత కేర్ తీసుకునే ప్రయత్నం చేశారు కానీ అవే ఇందులో మరింత ఇబ్బందికరంగా అనిపిస్తాయి. డైలాగ్స్ వర్క్ కూడా చాలా బ్యాడ్ గా ఉంది.
ఇక సినిమాలో విలన్ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా వీక్ గా ఉంది. నటుడు చైతన్య కృష్ణ నటన పరంగా పక్కన పెడితే తన రోల్ ఇంపాక్ట్ చూపించలేదు. అలాగే హీరోయిన్ పాత్ర కూడా ఈ సినిమాలో అంతే చప్పగా సాగుతుంది. కొంత సమయానికి తనకీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా నీట్ గా చేశారు. పాత బస్తీ సెట్టింగ్ అంతా బాగా ప్రెజెంట్ చేశారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం ఓకే అనిపిస్తుంది. క్రాంతి వర్ల కెమెరా వర్క్ బాగుంది. డైలాగ్స్ బాలేవు. ఎడిటింగ్ కూడా బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకుడు ప్రమోద్ హర్ష విషయానికి వస్తే.. నవాబ్ కేఫ్ (Nawab Cafe) కి తన వర్క్ ఓ మాదిరిగా ఓకే అనుకోవచ్చు. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, కొన్ని సీన్స్ వరకు తన వర్క్ బాగుంది కానీ ఆద్యంతం సినిమాకి మాత్రం ఆ పోటెన్షియల్ సరిపోలేదు. ఎమోషనల్ డెప్త్ ని ఇంకా బాగా మైంటైన్ చేసి ఉంటే నవాబ్ కేఫ్ (Nawab Cafe) బెటర్ ఫీల్ మిగిల్చి ఉండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే ‘నవాబ్ కేఫ్’ ఒక డిజప్పాయింటింగ్ ఎమోషనల్ డ్రామాగా మిగిలింది. నటుడు రాజీవ్ కనకాల, అలాగే యువ నటుడు శివ కందుకూరి తమ సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కథ, కథనాల్లో సత్తువ లోపించింది. వీటితో ఈ చిత్రం ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team


