‘మహానటి’ టీమ్ ను సత్కరించిన చంద్రబాబు నాయుడు !

Published on May 26, 2018 2:49 pm IST

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న దత్, ప్రియాంక దత్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మహానటి’ భారీ విజయాన్ని దక్కిచుకుంది ప్రేక్షకులు, సినీ పెద్దల మన్ననలు పొందుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ‘మహానటి’ చిత్ర బృందాన్ని ఘనంగా సన్మానించారు. సన్మాన సభలో మాట్లాడిన ఆయన నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ గొప్ప సాహసమే చేశారని కొనియాడారు.

అలాగే ఇలాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు మంచి భవిష్యత్తు ఉందని, సావిత్రిగారి జీవితం నుండి నేర్చుకోవాల్సింది చాలానే ఉందని, చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై ఆలోచిస్తామని, సినిమాకు పనిచేసిన అందరూ గొప్పగా పనిచేశారని, ఇలాంటి చిత్రాలు రావడం అరుదని, అందరూ తప్పక చూడాల్సిన సినిమా అంటూ అశ్విని దత్, కీర్తి సురేష్, నాగ్ అశ్విన్, సినిమాటోగ్రఫర్ డాని లను ఘనంగా సత్కరించారు.

ఆ తరవాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగారు పన్ను మిహాయింపు ఇవ్వడం గొప్ప గౌరవమని, మినహాయించిన పన్నును ప్రభుత్వం దగ్గరే ఉంచితే రాష్ట్రంలో జరిగే మంచి కార్యక్రమాలకు వినియోగిస్తారని భావిస్తున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం :