టికెట్ ఆన్లైన్ బుకింగ్ పై ఏపీ ప్రభుత్వం బ్రేకింగ్ గైడ్ లెన్స్..డీటెయిల్స్ ఇవే.!

టికెట్ ఆన్లైన్ బుకింగ్ పై ఏపీ ప్రభుత్వం బ్రేకింగ్ గైడ్ లెన్స్..డీటెయిల్స్ ఇవే.!

Published on Jun 3, 2022 8:00 PM IST

గత ఏడాది ఏడాదిన్నర కాలంలో టాలీవుడ్ మరియు ఏపీలో టికెట్ రేట్స్ కి సంబంధించి అనేక కీలక సంఘటనలు మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆకస్మికంగా తగ్గించిన టికెట్ ధరలు అలాగే హైక్స్ కి సంబంధించి చాలా కాలం రచ్చ నడిచింది. కానీ ఫైనల్ గా పలు కీలక మీటింగ్స్ తర్వాత టాలీవుడ్ కి అనుకూలంగా పలు నిర్ణయాలు ఏపీ ప్రభుత్వం తీసుకుంది.

అలాగే ఆన్లైన్ టికెట్ బుకింగ్ పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన కూడా అందించింది. ఇక ఇప్పుడు దీనిపై తాజాగా ఒక బ్రేకింగ్ గైడ్ లైన్స్ ని ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఏపీ ఎఫ్ డి సి పేరిట స్టార్ట్ చేసిన ఈ పోర్టల్ తో ఏపీలో అన్ని థియేటర్స్ వారు అగ్రిమెంట్ చేసుకొని తీరాలని, అన్ని థియేటర్స్ మరియు ప్రైవేట్ సంస్థలు కూడా దీని ద్వారానే అమ్మకాలు చేయాలనీ సూచించారు.

అలాగే ఈ బుకింగ్స్ లో ప్రతి టికెట్ పై కూడా 2 శాతం ఛార్జి ఉంటుంది అని ఈ టికెట్ అమ్మకలకు గాను థియేటర్స్ వారు తప్పకుండా తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చెయ్యాలి అని అన్ని కొత్త సినిమాల టికెట్ అమ్మకాలు ఇందులో వారం ముందు నుంచే స్టార్ట్ అవుతాయట. మరో నెల రోజుల్లో అంతా సిద్హం అయ్యిపోవాలని ఏపీ ప్రభుత్వం సూచించగా ఒకవేళ అలా చేయకుండా నిబంధనలు పాటించకపోతే ఆ థియేటర్స్ లైసెన్స్ రద్దు చేస్తామని కీలక ప్రకటన చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు