ఇకపై మరింత సులభం కానున్న సినిమా, టీవీ షూటింగ్ ప్రక్రియ..!

ఇకపై మరింత సులభం కానున్న సినిమా, టీవీ షూటింగ్ ప్రక్రియ..!

Published on May 20, 2020 12:33 AM IST

ఏపీలో సినిమా, టీవీ షూటింగ్‌లను ప్రోత్సహించేందుకు వీటి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టంను ఏర్పాటు చేసింది. గతంలో సంస్థ ఎండి ఇచ్చిన సూచనల మేరకు 2006లో ఇచ్చిన జీవో ms2 కు ప్రభుత్వం కొన్ని సవరణలు చేపట్టింది. అయితే నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ మరియ టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

అయితే గతంలో నిర్ణయించిన ఫీజులను, కషన్ డిపాజిట్లను కార్పోరేషన్‌కు చెల్లించి షూటింగ్ ముగిసిన అనంతరం వాటిని రీఫండ్ చేయాలని భావిస్తూ, సంస్థ ఎండీ సూచనల మేరకు రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలలో షూటింగ్ చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కేటగిరి 1 (ఓక్ రోజుకి కాషన్ డిపాజిట్ 15వేలు)

* రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న పార్కుల్లో షూటింగ్‌కు అనుమతి
* పట్టణాభివృద్ధి సంస్థ పార్కులు, మున్సిపల్ కార్పోరేషన్ అధీనంలో ఉన్న పార్కులలో షూటింగ్‌లకు అనుమతి
* రాష్ట్రంలోని వివిధ మ్యూజియం, బిల్డింగ్‌లు, పాఠశాలలు మరియు కాలేజీలలో షూటింగ్‌లకు అనుమతి

కేటగిరి 2 (ఒక రోజుకి కాషన్ డిపాజిట్ 10 వేలు)

* రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులు, ఎపిటిడిసి ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు మరియు ఉద్యానవనాలలో షూటింగ్‌లకు అనుమతి
* జిల్లా కేంద్రాలలోని పాఠశాలలు, కాలేజీలు, విజయవాడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో షూటింగ్‌లకు అనుమతి

కేటగిరి 3 (ఒక రోజుకి కాషన్ డిపాజిట్ 5 వేలు)

* మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు, బీచ్‌లు, అలిపిరి గార్డెన్స్‌తో సహా అన్ని పార్కుల్లో షూటింగ్‌లకు అనుమతి
* ఏపీటీడీసీ, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖల ప్రాంతాలలో షూటింగ్‌లకు అనుమతి

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు