ఏపీలో “ఆర్ఆర్ఆర్” టికెట్ ధరల పెంపు.. ఎంత పెంచుకోవచ్చంటే?

Published on Mar 17, 2022 11:00 pm IST


జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కాబోతుంది. అయితే ఏపీలో ఇటీవలే టికెట్ ధరల సమస్య ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. రెమ్యునరేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్‌ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తామని, మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం జీవోలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూ.336 కోట్లతో నిర్మించినట్లు నిర్మాతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా టికెట్‌పై మొదటి 10 రోజులు మరో రూ.75 పెంచుకునేందుకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత సమాచారం :