కత్తి మహేశ్ చికిత్సకు ఏపీ సర్కార్ భారీ సాయం..!

Published on Jul 3, 2021 2:01 am IST


ప్రముఖ సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేశ్ ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కత్తి మహేశ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కత్తి మహేశ్ తలకు బలమైన గాయాలు కావడంతో ఇప్పటికే శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కత్తి మహేశ్‌కు అందుతున్న వైద్య సేవలకు భారీగా ఖర్చవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్‌ చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం భారీ ఆర్థికసాయం అందించింది. సీఎం రిలీఫ్ ఫండ్‌ కింద 17 లక్షల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం లేఖ విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు కత్తి మహేశ్ కుటుంబ సభ్యులే ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ రాగా తాజాగా వారికి ఏపీ ప్రభుత్వం నుంచి భారీ సాయం అందింది.

సంబంధిత సమాచారం :