అక్కినేని అఖిల్ మాసివ్ హిట్ ‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వేడుకలకు వేదిక సిద్ధమైంది. థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్రబృందం గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.
ఈ ‘బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ ఈవెంట్‌కు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. గుంటూరు వేదికగా జూలై 15న సాయంత్రం 5 గంటల నుండి ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా వచ్చిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్‌తో గుంటూరులో పండుగ వాతావరణం నెలకొననుంది.


