మొత్తానికి వర్మను వెనక్కి పంపించేశారుగా !

Published on Apr 28, 2019 3:40 pm IST

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను, తన వివాదాస్పద సంఘటనలను అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే వర్మ ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా ఈ చిత్రం ఏపీలో మే 1వ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ రోజు విజయవాడలోని ఓ హోటల్‌ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్‌ మీట్ పెట్టాలని ప్రయత్నించిన వర్మకు ఆ హోటల్ యాజమాన్యం ప్రెస్ మీట్ కు అనుమతి నిరాకరించడంతో.. తన ప్రెస్ మీట్ ను నడి రోడ్డు పైనే పెట్టబోతున్నట్లు వర్మ ప్రకటించాడు.

వర్మ ప్రెస్ మీట్ పెడితే తెలుగు తమ్ముళ్లు ఎక్కడ రెచ్చిపోయి వర్మ పై ఎక్కడ దారుణంగా దాడి చేస్తారో అని పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వర్మను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు పంపించేశారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా తెలుపారు.

సంబంధిత సమాచారం :