మాస్ మహరాజ్ “క్రాక్”తో మళ్లీ హంగామా షురూ.!

Published on Jun 13, 2021 8:36 am IST

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “క్రాక్”. దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కాబడిన మొదటి సినిమాగా వచ్చి కేవలం 50 శాతం సీటింగ్ తోనే భారీ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా రవితేజ కెరీర్ లో కూడా హైయెస్ట్ గ్రాసర్ గా కూడా నిలబడింది.

మరి కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్స్ లోకి వచ్చిన రెండో చిత్రంగా వచ్చిన క్రాక్ మళ్లీ హంగామా చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ రెండో వేవ్ అనంతరం వైజాగ్ జగదాంబ థియేటర్ లో ఈరోజు మార్నింగ్ ఒక షో తో మళ్లీ థియేటర్ తలుపులు తెరిచిందిగా మారింది.. దీనితో మళ్లీ మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తుండగా సినీ ప్రముఖులు కూడా క్రాక్ రిలీజ్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. మరి ఇదే కంటిన్యూ అయ్యి మరిన్ని సినిమాలు విడుదల కావాలని ఆశిద్దాం..

సంబంధిత సమాచారం :