సెప్టెంబర్ 3న విడుదల కాబోతున్న “అప్పుడు ఇప్పుడు”..!

సెప్టెంబర్ 3న విడుదల కాబోతున్న “అప్పుడు ఇప్పుడు”..!

Published on Aug 28, 2021 8:03 PM IST

appudu ippudu

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో యు.కె.ఫిలింస్ బ్యానర్‌పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా తెరకెక్కిన చిత్రం “అప్పుడు ఇప్పుడు”. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 3న విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ మా “అప్పుడు-ఇప్పుడు” సినిమా ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కి మంచి పాపులారిటీ లభించిందని, మేకింగ్‌లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ సినిమాని తెరకెక్కించామని, హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారని అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవల పూరి జగన్నాద్ గారు విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని, విశ్వనాధ్ గారు విడుదల చేసిన పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని, అలాగే శ్రీకాంత్ గారు, సునీల్ గారు విడుదల చేసిన పాటలు కూడా మంచి హిట్‌గా నిలిచాయని, మా సినిమాకు వీరందరూ మంచి సపోర్ట్ అందించారని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 3న మా సినిమాని విడుదల చేస్తున్నామని అన్నారు.

తాజా వార్తలు