పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించిన మురుగదాస్

Published on Apr 13, 2021 5:54 pm IST

ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆయన డైరెక్ట్ చెయ్యట్లేదు. నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత ఓం ప్రకాష్‌ భట్ తో కలిసి మురుగదాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘1947’ అనేది ఈ సినిమా టైటిల్. టైటిల్ బట్టి చూస్తే చిత్రం స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలోనో లేకపోతే ఎవరైనా ఒక ఫ్రీడమ్ ఫైటర్ జీవితం మీదనైనా అయ్యుండవచ్చని అనిపిస్తోంది.

అయితే మురుగదాస్ బృందం మాత్రం ఏ విషయాన్నీ రివీల్ చేయలేదు. కేవలం సినిమాను మాత్రమే ప్రకటించారు. ఈ చిత్రాన్ని కనడ దర్శకుడు పొన్‌ కుమరన్‌ డైరెక్ట్ చేయనున్నారు. ఈయన గతంలో దర్శన్ హీరోగా ‘యాజమాన్య’ సినిమా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను భారీ వ్యయంతో పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :