బన్నీ కోసం ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకున్న మురుగ.!

Published on Oct 3, 2021 1:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం తన భారీ సినిమా “పుష్ప” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా అనంతరం మరిన్ని ఆసక్తికర సినిమాలను బన్నీ చెయ్యడానికి రెడీగా ఉన్నది. అయితే ఎప్పుడో బన్నీ కాంపౌండ్ నుంచి కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో సినిమా ఉందని కన్ఫర్మ్ అయ్యింది. కానీ అందుకు సమయం అనేది ఇంకా సెట్ అవ్వలేదు.

కానీ ఇప్పుడు ఈ సాలిడ్ కాంబోపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దాని ప్రకారం మురుగ ఈ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ లైన్ ని ఎంచుకున్నారట. ఇది వరకు సామాజిక అంశాలతో ఆకట్టుకున్న మురుగదాస్ బన్నీ కోసం ఒక స్కైఫై జానర్ లైన్ ని ఎంచుకున్నాడట. ఇది కూడా భారీ లెవెల్లోనే ఉంటుందని తెలుస్తుంది. ఇది వరకు ఈ ఇద్దరి నుంచి కూడా ఇలాంటి తరహా సినిమా రాలేదు సో వీరి నుంచి ఇది కొత్త ప్రయోగమే అని చెప్పాలి. మరి ఈ టాక్ ఎంత వరకు నిజమో వేచి చూస్తే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :