‘పెద్ది’పై ఏఆర్ రెహమాన్ సాలిడ్ కాన్ఫిడెంట్..!

‘పెద్ది’పై ఏఆర్ రెహమాన్ సాలిడ్ కాన్ఫిడెంట్..!

Published on May 18, 2026 11:00 PM IST

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఎట్టకేలకు ‘పెద్ది’ చిత్రంతో నేరుగా తెలుగు సినిమాలోకి అడుగుపెడుతున్నాడు. ముంబై ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇన్నాళ్లూ సరైన తెలుగు కథ కోసం ఎదురుచూశానని, ‘పెద్ది’ ఆ నిరీక్షణను ముగించిందని పేర్కొన్నాడు. కథల ఎంపికలో చాలా నిశితంగా ఉండే రెహమాన్ ఈ సినిమాకు అంగీకరించటం విశేషం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లోకి రెహమాన్‌ను తీసుకువచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఈ చిత్రానికి రెహమాన్ మెయిన్ పిల్లర్ అని చరణ్ అన్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

తాజా వార్తలు